Saturday, August 29, 2020
శ్రీ పరమహంస సద్గురు ఫులాజి బాబా గారి పుట్టిన రోజు సంధర్బంగా :
శ్రీ సద్గురు ఫులాజి బాబా గారు aug 30 19౨౫ స "లో శ్రీమతి పుంజాబాయి దొండుజి ఇంగ్లే గార్లకు సావళి అను గ్రామంలో అవుండా నాగనాథ్ తాలూకా ,హింగోలి జిల్లాలో జన్మించారు .
డిసెంబర్ 25 తారీఖున (నాందేడ్ )2018
బ్రహ్మ లీనమయ్యారు .
27 న సిద్దమహాయోగ పీఠం ధర్మ సేవాసమితి ,సిద్దేశ్వర ట్రస్ట్ ,పట్నాపూర్
గ్రామంలో వారు స్వయంగా తయారు చేసుకున్న సమాధి లో స్థిరం అయ్యారు .
ప్రతి సంవత్సరం ఆగస్టు ౩౦ న బాబా
జన్మదిన వేడుకలను సిద్దేశ్వర్ సంస్థాన్
పాట్నాపూర్ యందు భక్తి భావంతో జరిపించేవారు .
ఆత్మా సాక్షాత్కారాన్ని పొందిన మహా మనీషి సద్గురు ఫులాజి బాబా .ఈశ్వర తత్వాన్ని సముపార్జించిన అవతార పురుషులు గీతలో చెప్పినట్లుగా కోటికొక్కరు మాత్రమే జన్మిస్తారని .అట్టి కోవకు చెందిన వారు బాబా గారు .
శ్రీ ఫులాజి బాబా సహజ సిద్ధంగా తనకు
లభించిన అనుభవ జ్ఞానాన్ని కొన్ని వేల
మంది భక్తులకు సత్సంగాల ద్వారా ,
ప్రవచనాల ద్వారా మార్గ దర్శకం చేసేవారు .చరాచర జీవరాశి అంతా
పరమాత్మ ప్రతిరూపాలే అని ,అఖండ
అవినాశి ఐన పరమాత్మ అన్ని ప్రాణులలో ఆత్మ రూపంలో అమరి ఉన్నాడని ,ఆంతర్యమిగా మనందరిలో
స్థిరమై ఉన్నారని బోధించేవారు .
ఎందరో భక్తులకు అనుగ్రహమిచ్చి
శక్తి పాతం గావించి జ్ఞాన జ్యోతులను
వెలిగించారు .ఆత్మ జ్ఞానం ద్వారా స్వస్వరూప దర్శనం పొంది ఎందరొ
తరించారనడంలో ఏ మాత్రం సందేహం
లేదు .సద్గురు కృపాదృష్టి పొంది
ఎంతో మంది భక్తులు ఙ్ఞాన సంపదను
సముపార్జించారు .
అందరిలో అమర ఉన్న అంతర్యామి ని తెలుసుకోవడానికి ధ్యానమనే సులభమైన సహజ యోగ మార్గాన్ని
చూపించారు .ప్రతి ఒకరు నిష్కామ భావంతో ,అహంకారాన్ని వదిలి నిత్యం
ధ్యానం చేయమని చెప్పేవారు .
ఆత్మ సుఖాన్ని పొందాలన్న ,ఆధ్యాత్మిక ఙ్ఞానాన్ని సముపార్జించాలన్న ,శాంతి సమాధానాన్ని పొందాలన్నా సద్గురువుల
సాంగత్యం ఎంతో అవసరం .
అంతటి గొప్ప సద్గురువు ఫులాజి బాబా ప్రత్యక్షంగా వచ్చి అలౌకిక ఆత్మజ్ఞానాన్నిచ్చి అదృశ్యమయ్యారు .
వారి మేలును ఎన్నటికీ మరువలేము .
ఇంత గొప్ప మహనీయుడు మన
కళ్లముందుండి ఙ్ఞాన గంగను ప్రవహింప
చేసి కనిపించకుండా మనసు మదిలోన
దాగున్నారు .
ఇకనైనా కళ్లుతెరవండి అని చెబుతూ చెబుతూనే నిరాకారంలో ఉండిపోయారు .వారిని దర్శించుకోవడం
మనందరం చేసుకున్న పుణ్యం .వారి సన్నిధిలో గడిపిన మధుర క్షణాలను జీవితంలో మరువలేని జ్ఞాపకాలు .
అనంత విశ్వంలో మనమున్నాము ,
మనలో విశ్వం దాగి ఉంది ,
అదే ఈశ్వర రూపమని
అమూల్యమైన సందేశమిచ్చారు .
పరమాత్మా స్వరూపులైన ఫులజి బాబా
మాములు మనిషిగా జన్మించి అసామాన్యమైన కీర్తిని పొంది ఆత్మ యోగిగా చిరస్మరణీయులుగా మిగిలి పోయారు .
ఈ రొజు వారి 96 వ పుట్టిన రొజు
మనకళ్లముందు ఆకారంలో లేకపోయినను ఆత్మ రూపంలో ,నిర్గుణ నిరాకార లో అదృశ్య రూపంలో అంతట
నిండి ఉన్నారు .
బాబా అంటుండే వారు
ఎదో ఒకరోజు నేను మరణించవచ్చు ,
నా ధ్యానం మరణించవచ్చు ,కానీ
నా ఙ్ఞానం ఎప్పటికి నిలిచి ఉంటుంది .
బాబా మిమ్మల్ని భక్తి భావంతో స్మరించుకుంటూ మనసు పొరలలో దర్శించుకుంటాము .మా అందరి మదిలో
మీరు నిండి ఉండాలని కోరుకుంటూ ,ఆధ్యాత్మిక ఙ్ఞాన మార్గంలో
మమ్మల్ని నడిపించాలని కొరుకుంటూ
మీ సమాధి సన్నిదిలో సమర్పించు కుంటూ మా ప్రార్థనను స్వీయకరించు
బాబా ,,,,,,,,,,,,,,,,,
సద్గురు నీ నామ స్మరణ ప్రతి నిత్యం మేము జపించని ,
ఈశ్వరుడొక్కడే అని అందరిలో ధృడ
భావాన్ని నిర్మించు ,
మా అందరికి సమాధి సేవ భాగ్యాన్ని కలిగించు ,
ఆధ్యాత్మిక కార్యంలో పాలుపంచుకోనివ్వు ,
మాకు లభించిన ఈ జన్మను సార్థకం చేసుకోనివ్వు ,,,,,,,,,,,,,,,,,